పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి: మల్లు నర్సింహ రెడ్డి

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి: మల్లు నర్సింహ రెడ్డి

MBNR: పుస్తక పఠనం అలవాటు ప్రతి ఒక్కరికి అవసరమని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని చెప్పారు.