పొదిలి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు
ప్రకాశం: బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా భక్తులకు సౌకర్యం కల్పించేందుకు పొదిలి ఆర్టీసీ డిపో నుంచి బ్రహ్మంగారి మఠంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మంగారిమఠంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. మొత్తం 25 బస్సులను భక్తుల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు.