హైవేపై ఉన్న లేబర్ అడ్డాను మార్చండి!

హైవేపై ఉన్న లేబర్ అడ్డాను మార్చండి!

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి రోడ్లలోని లేబర్ అడ్డా వద్ద రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పెద్ద ఎత్తున కార్మికులు నిలుచుంటున్నారు. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్, కళాశాల వచ్చిపోయే వారికి ఆటంకం కలుగుతోంది. సంబంధిత అధికారులు స్పందించి లేబర్ అడ్డాను ఇతర ప్రాంతానికి మార్చాలని స్థానికులు కోరుతున్నారు.