సన్నబియ్యం ఆలోచన రేవంత్‌దే: ఉత్తమ్
TG: సన్నబియ్యం ఆలోచన సీఎం రేవంత్ తీసుకువచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఏటా 14,500 కోట్లు సన్నబియ్యానికి ఖర్చు చేస్తున్నామని అన్నారు. సన్నబియ్యంతో పేదలకు కడుపునిండా భోజనం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. అడిగిన అందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు.