పాపను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

పాపను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

KMR: రాజంపేట మండల కేంద్రంలో ఓ పాప తప్పిపోయి బస్టాండ్‌లో ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారించగా పాపకు మాటలు రాకపోవడంతో స్థానికులను విచారించి దోమకొండ మండలం అంచనూరు గ్రామానికి చెందిన గిడి రాజమణి-వెంకట్ కుమార్తెగా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.