ప్రజా సమస్యలపై ఈనెల 13న కాంగ్రెస్ నిరసన దీక్ష
KRNL: గోనెగండ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈనెల 13న నిరసన దీక్ష చేపట్టనున్నట్లు DCC అధ్యక్షుడు క్రాంతినాయుడు తెలిపారు. తాగునీరు, ట్రాఫిక్, వైద్యం, మైనార్టీ సంక్షేమం, అమలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోకు, పోలీసులకి వినతి పత్రం అందించారు.