నూతన సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: అచ్చంపేట మండలంలోని బొమ్మన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ ఏర్పాటు వల్ల వ్యవసాయానికి, పలు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.