జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

KNR: కరీంనగర్ నగరం బుధవారం కురిసిన భారీ వర్షంతో అతలాకుతలమైంది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రాబోయే గంటల్లో కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.