ఉమ్మడి గుంటూరుకు ఐదు కోర్టులు మంజూరు..!
GNTR: రాష్ట్ర వ్యాప్తంగా 96 ప్రాంతాల్లో వివిధ జిల్లాల పరిధిలో కొత్త కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు ఐదు కోర్టులు మంజూరు కాగా.. జిల్లా కేంద్రంలో మరో కుటుంబ న్యాయస్థానం, సత్తెనపల్లి, మంగళగిరిలో అదనపు సీనియర్ సివిల్ జడ్డి కోర్టులు, వినుకొండలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, అమరావతిలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయనున్నారు.