30వ సారి రక్తదానం చేసిన కానిస్టేబుల్
అన్నమయ్య: రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్. పవన్ కుమార్ సోమవారం రాయచోటి శ్రీ దీప బ్లడ్ బ్యాంక్‌లో 30వ సారి రక్తదానం చేశారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీకి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వెంటనే స్పందించి రక్తం అందించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం తన అలవాటుగా మార్చుకున్నారు.