అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
NDL: 2023లో కోవెలకుంట్లలో జరిగిన అత్యాచారం కేసులో శుక్రవారం ముద్దాయి దూదేకుల దస్తగిరికి కర్నూలు కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. మతిస్థిమితం లేని మహిళను మాయమాటలు చెప్పి రైల్వే స్టేషన్ రోడ్డుకు తీసుకెళ్లి నేరం చేసినట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా శిక్ష ఖరారైంది.