కోడూరులో విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
కృష్ణా: కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెరపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతి చెందారు. ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సానందుల నాంచారయ్య (60) బుధవారం తన పూరిపాకలో విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. మృతుడి కుమార్తె తన్నీరు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.