'ప్రజల ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి'
VZM: ప్రజల ఫిర్యాదులను చట్టపరిధిలోని తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం 42 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.