'అనధికార ఫ్లెక్సీలు, వ్యాపార ప్రకటనలు నిషేధం'

GNTR: పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిలోనీ డివైడర్ల మధ్య అనధికార ఫ్లెక్సీలు, వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు హెచ్చరించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణ రూపురేఖలు మారడంతో పాటు ప్రయాణికుల దృష్టి మరల్చి ప్రమాదాలు జరిగే సూచనల నేపథ్యంలో నేటి నుండి నిషేధించినట్లు తెలిపారు.