'అమితాబ్ బచ్చన్ కూడా ఇబ్బంది పడ్డారు'
రకుల్ ప్రీత్ తన కుటుంబ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉంటారనేది సరికాదని తెలిపింది. సినీ రంగంలో ఒడిదుడుకులు చాలా సహజమని, అమితాబ్ బచ్చన్ వంటి వారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చింది. సినిమా నిర్మాణం అనేది అతిపెద్ద రిస్క్‌తో కూడుకున్న వ్యాపారమని.. ఒడిదుడుకులు సాధారణమని పేర్కొంది.