ఆటో డ్రైవర్ పై దాడి.. కేసు నమోదు
MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి, మచ్చ బొల్లారం కొత్త బస్తీకి చెందిన నిషాణి జితేందర్ కానాజిగూడ అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద ఎల్పీజీ కోసం క్యూలో ఉండగా నంబర్ ప్లేట్ లేని ఆటోలో వచ్చిన గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. దాడిలో జితేందర్ ఎడమ కంటికి గాయమైంది. అడ్డుకున్న తండ్రి శ్రీపతిని దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.