క్యూఎస్‌ ఆసియా టాప్‌ 100లో 5 ఐఐటీలు

క్యూఎస్‌ ఆసియా టాప్‌ 100లో 5 ఐఐటీలు

క్యూఎస్ ఆసియా ర్యాంకింగుల్లోని టాప్ 100లో మన దేశంలోని 5 IITలు స్థానం దక్కించుకున్నాయి. వీటిలో ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, కాన్పూర్, ఖరగ్‌పూర్ IITలు ఉన్నాయి. 2016లో భారత్ నుంచి ఈ జాబితాలో 24 సంస్థలే ఉండేవని.. ప్రస్తుతం 294 సంస్థలకు చోటు లభించిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆసియాలో 59వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ.. దేశంలో మాత్రం అత్యుత్తమ ర్యాంకును సాధించింది.