సత్తెనపల్లిలో తాటి గీత కార్మికులకు కౌన్సెలింగ్

సత్తెనపల్లిలో తాటి గీత కార్మికులకు కౌన్సెలింగ్

PLD: సత్తెనపల్లి ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ గురువారం తాటి గీత కార్మికులకు అవగాహన కల్పించారు. అబ్కారీ నిబంధనలకు లోబడి మాత్రమే గీత, విక్రయాలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. కల్లులో ఎటువంటి రసాయనాలు కలపకూడదని, స్వచ్ఛతను పాటించాలని హెచ్చరించారు. కేటాయించిన చెట్లు, నిర్ణీత ప్రదేశాల్లోనే తమ వృత్తిని కొనసాగించాలని సీఐ సూచించారు.