మార్కెట్లో క్వింటా పత్తి ధర ఎంతంటే..?

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పత్తి ధర ఈరోజు భారీగా పెరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. ఈరోజు రూ.7,700 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ధర పెరగడం రైతులకు సంతోషం కలిగించే విషయం.