VIDEO: 'రోడ్ల మరమ్మత్తులు సకాలంలో పూర్తి చేయాలి'
NRML: గురువారం పట్టణంలో జరుగుతున్న రోడ్ల మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను నాణ్యంగా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గుంతలు లేకుండా రోడ్లు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్గంలో ఫుట్‌పాత్ మరమ్మత్తులు చేయాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు.