ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KRNL: కుమారుడి పెళ్లికి పత్రికలు పంచేందుకు వెళ్తున్న తండ్రి ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెకి చెందిన వెంకటరమణ బుధవారం పెళ్లి పత్రికలతో చెన్నంశెట్టిపల్లెకు వెళ్తున్నారు. క్రాస్ రోడ్డులో నంద్యాల నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.