ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు.