రేపు చేపల చెరువుకు బహిరంగ వేలం పాట

రేపు చేపల చెరువుకు బహిరంగ వేలం పాట

ATP: రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలోని చెరువులో చేపలు వదిలి పెంచుకొని అమ్ముకునే హక్కును కల్పించడానికి గురువారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకటరాముడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ వేలం నిర్వహిస్తామని ఆసక్తి గల వారు రూ.1000 డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని కోరారు.