VIDEO: అద్దంకిలో మున్సిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

VIDEO: అద్దంకిలో మున్సిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

BPT: అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు దీక్షలలో కూర్చున్నారు. కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, 12వ పిఆర్సి అమలు చేయాలని, వయోపరిమితి 62కు పెంచాలని, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.