నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కోనసీమ: అయినవిల్లిలో సబ్ స్టేషన్ పరిధిలో నూతన విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని EE రాంబాబు శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయినవిల్లంక, వీరవల్లిపాలెం, కోటలంక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.