ఆడబిడ్డ పుట్టిన వారికి రూ.5 వేలు ఫిక్స్‌డ్ డిపాటిట్
NRML: జిల్లాలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అనంత్ పేట గ్రామ సర్పంచ్ సునీత ‘మా ఊరి బంగారు తల్లి’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఎవరికైనా ఆడబిడ్డ జన్మిస్తే, ఆ పాప పేరు మీద సర్పంచ్ తన సొంత ఖర్చులతో బ్యాంకులో రూ. 5 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. దీంతో పాటు రెండు శ్రీగంధం మొక్కలను అందజేస్తున్నారు.