టీడీపీ నాయకులు పల్లె నిద్రలో పాల్గొనాలి: ఎమ్మెల్యే

PLD: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. నరసరావుపేట మండలం కేఎం అగ్రహారంలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు, సమస్యలపై ప్రజలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.