భారీ వర్షాలకు కూలిన ఇళ్లు

MDK: తూప్రాన్ మండలంలో భారీ వర్షం కురవడంతో పలు ఇళ్లు దెబ్బతినగా, పలు ఇళ్లల్లో నీరు వచ్చి చేరింది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో పోటరి నర్సింలు ఇల్లు కూలింది. మండలంలోని ఘనపూర్ గ్రామంలో దొడ్లే అంతమ్మ ఇల్లు కూలింది. తూప్రాన్ పట్టణంలో మన్నే బాలరాజు, రాము, ఇస్లాంపూర్‌లో కొండాపురం యాదగిరి ఇండ్లలోకి నీరు వచ్చి చేరాయి.