కాండ్లా పోర్టు కార్యకలాపాలు నిలిపివేత

కాండ్లా పోర్టు కార్యకలాపాలు నిలిపివేత

గుజరాత్‌లోని కాండ్లా పోర్టు కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. పాక్‌తో ఉద్రిక్తతల వేళ భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోర్టులో ఉన్న ఓడలు తమ లైట్లను నిలిపివేయాలని సూచించారు. కచ్ ఆర్థిక వ్యవస్థకు, ఆహార పదార్థాల ఎగుమతికి, చమురు దిగుమతులకు ఈ కాండ్లా పోర్టే కీలకంగా ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పోర్టు కార్యకలాపాలు నిలిపేయాలని ఆదేశించారు.