జిల్లాలో ఐదు ఎమర్జెన్సీ రిస్టోరేషన్ టీం వాహనాలు
KMM: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్' వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి ఆదివారం తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని అన్నారు.