'జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు'
PPM: జిల్లాలో పశు గ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు తెలిపారు. ఓ పత్రికలో ప్రచురితమైన గ్రాసం కరువు పోషణ బరువు శీర్షికకు సోమవారం ఆయన స్పందించారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండలాల్లో రైతులు వరిపంట కోతలకు యంత్రాలను వినియోగించడం వలన పశు గ్రాస కొరత ఏర్పడడం వాస్తవం అన్నారు.