శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు: ఎస్పీ
సత్యసాయి: శత జయంతి ఉత్సవాలకు ఈ నెల 15 - 19 వరకు రోజుకు 80 వేల మంది, 20-23 వరకు రోజుకు లక్ష మందికి పైగా భక్తులు పుట్టపర్తికి వస్తారని ఎస్పీ సతీశ్ కుమార్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తుల వాహనాలను పార్కింగ్ ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి నడక మార్గంలో మందిరానికి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.