'నేరడి బ్యారేజీ గురించి ఎంతో కృషి చేశాం'
AP: శ్రీకాకుళం TDP కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం 2010లో నేరడి బ్యారేజీపై ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిందన్నారు. గతంలో TDP హయాంలో బ్యారేజీ గురించి ఎంతో కృషి చేశామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారాక బ్యారేజ్ పనులు ఆగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.