జిల్లా కోర్టులో ఈనెల13న జాతీయ లోక్ అదాలత్

BHPL: జిల్లా కోర్టులో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీఐ నరేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చిన్న కేసులు, భార్యా భర్తల వివాదాలు, ఆస్తి తగాదాల కేసులు ఇరువర్గాలు కూర్చొని పరిష్కరించుకోవాలని, కోర్టుకు రాకుండా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. రాజీమార్గమే రాజా మార్గమని ఆయన అన్నారు.