అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ, 16వ డివిజన్లలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇవాళ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రజాప్రతినిధులు తెలిపారు.