పాక్ రాజ్యాంగ సవరణపై యూఎన్ హెచ్చరిక
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారుస్తూ ఆ దేశ పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ తొందరపడి ఆమోదించిన రాజ్యాంగ సవరణలు న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తాయని, సైనిక జవాబుదారీతనం, చట్ట పాలనపై గౌరవం తగ్గుతాయని తెలిపింది. న్యాయవ్యవస్థలో జోక్యం, కార్యనిర్వాహక నియంత్రణకు లోనయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.