ఆపత్కాలంలో ఎంతో ఉపయోగపడుతుంది: నరేష్

ఆపత్కాలంలో ఎంతో ఉపయోగపడుతుంది: నరేష్

SRCL: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ నరేష్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారురాలు చింతల కవితకు రూ 19,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ.. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.