రూపాయి బిళ్లలతో సర్పంచ్ నామినేషన్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన జంగిలి మహేందర్ అనే యువకుడు వినూత్నంగా రూపాయి బిళ్ళలతో నామినేషన్ వేశారు. గత ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓటమి చెందారు. దీంతో ఒక్క ఓటు విలువ తెలియడంతో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా వెయ్యి రూపాయి బిళ్ళలతో నామినేషన్ వేసినట్లు మహేందర్ చెప్పారు.