ఆకాశంలో ఏర్పడ్డ అందమైన హరివిల్లు
MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఆకాశంలో అందమైన హరివిల్లు ఏర్పడింది. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జన్నారం మండలంలో తేలిక పాటి వర్షం పడింది. అదే సమయంలో ఎండ వాతావరణం ఉండడంతో ఆకాశంలో హరివిల్లు ఏర్పడి అందరిని అలరించింది. ఆకాశంలో హరివిల్లు ఏర్పడడం అరుదుగా ఉంటుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ కెమెరాలలో బంధించారు.