పన్నులు చెల్లించండి.. ఎమ్మెల్యే రిక్వెస్ట్!
కృష్టా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ప్రాపర్టీ టాక్స్, నీటి పన్నులు తదితర పన్నులు తప్పనిసరిగా చెల్లించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో ఆయన పన్నులు సమయానికి చెల్లించడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ పథకాన్ని వినియోగించుకుని బకాయిలను చెల్లించాలన్నారు.