విద్యార్థిని అభినందించిన కలెక్టర్
JGL: యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 ఖోఖో పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మూడో స్థానం సాధించింది. ఈ విజయానికి జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థి గండ్ర నరహరి కీలకంగా తోడ్పడ్డాడు. నరహరిని అదనపు కలెక్టర్ లత, జిల్లా విద్యాధికారి రాములు అభినందించారు. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు నరహరికి శుభాకాంక్షలు తెలిపారు.