శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ పై కారు బ్రేక్ డౌన్
RR: గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్‌పై ఓ కారు బ్రేక్ డౌన్ అయింది. నానక్‌రామ్‌గూడ నుంచి మీనాక్షి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. స్పందించిన ట్రాఫిక్ సిబ్బంది వాహనాన్ని క్లియర్ చేయడానికి, ట్రాఫిక్‌ను నియంత్రించడానికి శ్రమిస్తున్నారు. వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.