'అధిక వసూళ్లు చేస్తే ఫిర్యాదు చేయండి'
SRPT: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలు అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఆన్‌లైన్ ఫీజు మాత్రమే చెల్లించాలని సూచించారు. ఎవరైనా అదనపు డబ్బులు అడిగితే మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.