'ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్'

'ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్'

VZM: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేలా.. ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారని జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సీఎం చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని తెలిపారు.