విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
VKB: పరిగి మండలం పేటమాదారంలో విద్యుత్ షాక్‌తో బుధవారం యువ రైతు మృతి చెందాడు. బోరు మోటర్ స్టాటర్ వైర్ మార్చే క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో మంచన్ పల్లి మహేష్ (22) అనే యువ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.