సెల్ టవర్ ఎక్కి రైతు హల్ చల్

సెల్ టవర్ ఎక్కి రైతు హల్ చల్

అన్నమయ్య: రాయచోటిలోని ఎగువ అబ్బవరం కొత్తకురవపల్లికు చెందిన రైతు 498 సర్వే నంబర్లో గల 9 ఎకరాల భూమి విషయమై టవర్ ఎక్కి ఆదివారం హల్ చల్ చేశాడు. గ్రామానికి చెందిన గౌనిపల్లి ఆంజనేయులు అనే వ్యక్తి తన భూమిలోకి వెళ్లేందుకు దారి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతనిని కిందికి దింపారు.