రేషన్ దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

రేషన్ దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KMR: సదాశివ నగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు, పంపిణీ విధానం, స్టాక్ రిజిస్టర్, విక్రయ రికార్డులను పరిశీలించారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, బియ్యం కొరత లేకుండా సమయానికి అందుబాటులో ఉంచాలన్నారు.