రేపటి నుంచి సోయాబిన్ కొనుగోలు ప్రారంభం
KMR: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రేపటి నుంచి సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయని మండల వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. 10 నుంచి 13 వరకు మద్నూర్, వాడి ఫతేపూర్ గ్రామ శివారు రైతుల నుంచి సోయా కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఏఈవో వద్ద ధృవీకరణ పత్రాలతో టోకెన్ తీసుకుని పంట అమ్మకానికి తీసుకురావాలని సూచించారు.