VIDEO: ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో ప్రమాదకరంగా మ్యాన్ హోల్స్..!
MDCL: ఉప్పల్ పరిధి శ్రీనగర్ కాలనీలో మ్యాన్ హోల్స్ ప్రజలకు ప్రాణహానిగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూతలు లేకపోవడం, కొన్ని చోట్ల విరిగిపోవడం వల్ల ఎవరైనా అప్రమత్తంగా లేకపోతే లోపల పడిపోయే ప్రమాదం ఉంది. రాత్రివేళల్లో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇటీవల చిన్నపాటి ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.