యువత దేశానికి ఆదర్శంగా నిలవాలి: ఎస్సై

యువత దేశానికి ఆదర్శంగా నిలవాలి: ఎస్సై

KMM: యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని ముదిగొండ ఎస్సై హరిత అన్నారు. సీఐ మురళీ ఆదేశాల మేరకు బుధవారం మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్‌పై ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్దాలు, మహిళలపై నేరాలు, సైబర్ క్రైమ్ నిర్మూలన కొరకు ప్రజలు అందరూ సహకరించాలని పేర్కొన్నారు.